నిత్యానందకు పురుషత్వ పరీక్ష
బెంగళూరు:వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద అసలు బండారం బయట పడనుంది. అతనికి పురుషత్వ పరీక్షలు చేయనున్నారు. వచ్చే నెల 6న పురుషత్వ పరీక్షల కోసం విక్టోరియా ఆస్పత్రికి హాజరు కావాలని సీఐడీ అధికారులు నిత్యానందకు నోటీసులు జారీ చేశారు. పరీక్షలకు హాజరుకాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిత్యానందుడిపై పలు కేసులు ఉన్న నేపథ్యంలో వాటిలో ఒక కేసుకు సంబంధించి అతనికి పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని రామనగర జిల్లా కోర్టు ఆదేశించింది. జిల్లా కోర్టు ఆదేశాలపై నిత్యానంద హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
పురుషత్వ పరీక్షల నుంచి తనను మినహాయించాలని నిత్యానందా స్వామి హైకోర్టును కోరారు. తాను థార్మిక గురువునని, తనకు ఐహిక సుఖాలపై వాంఛలు ఉండవని, అందువల్ల తనకు పురషత్వ పరీక్షలు నిర్వహించకూడదని పేర్కొన్నాడు. ఈ కేసును విచారించిన హై కోర్టు నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది.
కస్టడీలోకి తీసుకోవచ్చన్న హైకోర్టు
కేసుకు సంబంధించి సాధారణ ప్రజల మాదిరిగానే నిత్యానందను విచారించాలని, అవసరమైన పరీక్షలు నిర్వహించవచ్చునని కోర్టు తీర్పు చెప్పింది. కింది కోర్టు ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. జులై 28 నుంచి నిత్యానందను పోలీసులు కస్టడీలోకి తీసుకుని పురుషత్వ, రక్త తదితర పరీక్షలతో పాటు విచారణ కూడా చేయవచ్చునని హైకోర్టు తెలిపింది. దాంతో సీఐడీ అధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు.
అత్యాచారానికి పాల్పడ్డాడంటు ఎన్‌ఆర్‌ఐ ఫిర్యాదు
నిత్యానంద తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ప్రవాసభారతీయురాలు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట ఈ పరీక్షను 28నే చేయించాలని భావించినా ఏర్పాట్లు చేయకపోవటంతో ఆగస్టు 6కు వాయిదా వేశారు. అదే రోజు పరీక్షకు హాజరుకావాలంటు నిత్యానందకు నోటీసులు జారీ చేశారు.

No comments:
Post a Comment